Saturday, December 17, 2022

నీకోసం..

నీకోసం.. 

నిల్చుని ఉన్నా  ఒక మూల

పట్టుకుని నా  ప్రేమ  మాల

నువ్వు

 నా కలల్ని చదివేసావో

నా కళ్ళలోకొచ్చి చూసావో

జీవితంలోకి వచ్చావు

వసంతం తెచ్చేవు.

దోసిలి పూలు

 ఈ దోసిలి పూలు నీ కోసం 

పడిగాపులు పడి ఎదురు చూస్తున్నవి

ఈ కనుకొనల కన్నీటి చుక్క

లక్ష అక్షౌహిణలంత భారవవుతున్నది.

నీ చూఫు పడని ఈ చీకటిలో

నేనుండలేకపోతున్నాను

నీ నవ్వు పూయని ఈ అమవాసని

నే చూడలేకపోతున్నాను

మౌనం

 నీ  మౌనం..

కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల 

దూరంలా భారంలా అనిపిస్తుంది 

నీ నిశ్శబ్దం..

కొన్ని కోట్ల శత్రుఘ్నుల శబ్దంలా 

మనసును విచ్చిన్నం చేస్తుంది.

తెలియలేదు..

 నాకు నేను నచ్చలేదు

నువ్వు మెచ్చుకునే వరకూ..

నేనంటే నాకు అంత ఇష్టం లేదు

నువ్వు ఇష్టపడే వరకూ

అంతెందుకు..

నువ్వు వచ్చే వరకూ 

నువ్వు చూసే వరకూ

నువ్వు నవ్వే వరకూ

ప్రపంచం ఇంత అందంగా 

ఉంటుందనే తెలియలేదు..

భాష

 అక్షరాలకేమి తెలుసు..

నీ గురించి రాయాలంటే..

అవి కూడా భాష నేర్చుకోవాలని..

ఏభై ఆరు అక్షరాలు

 అక్షరాలన్నీ కూడబలుక్కుని

మొరాయిస్తున్నాయి...

ఒరేయ్ పిచ్చి సన్నాసీ,

ఐదు.. ఆరు జన్మల బంధాన్ని

ఈ ఏభై ఆరు అక్షరాల్లో ఎలా 

బంధించమంటావు అని.

సఖీ..

 ఎందులో చూసినా నువ్వే కనపడి మురిపిస్తావు

మరుక్షణం.. నా పక్కన లేవని గుర్తుచేసి ఏడిపిస్తావు.

నీ ఆలోచనలనే ఆవాహన చేసుకుని

నీ జ్ఞాపకాలనే పచ్చబొట్టులుగా వేసుకుని

ఎదురుచూస్తూ ఉంటాను సఖీ..

నీ తోడు

 ప్రతి అక్షరం నిన్ను కలవరిస్తుంది .. 

ప్రతి పదం నిన్ను పలవరిస్తుంది.. 

నువ్వుంటే పారిజాత వనం 

నీవెంటే నిత్యం నందనవనం .

ప్రతి ఉదయం నీ నవ్వుల సంబరం 

ప్రతి సాయంత్రం  నీ జ్ఞాపకాల సరంభం

నీ తోడుంటే నిత్యం ఆనందాల అంబరం

Friday, December 16, 2022

నీ నవ్వు

 ఎన్నాళ్ళనుండో చదవాలనుకుంటున్న పుస్తకం 

హఠాత్తుగా చేతికి దొరికినట్లు..

ఎన్నో రాత్రులు కూర్చున్నా పూర్తి కాని కవిత

అనుకోకుండా అలవోకగా వచ్చేసినట్లు


అంతెందుకు..

ఆకాశంలో ఉండే చందమామ 

గబుక్కున చేతిలోకి వచ్చేసినట్లు

చిన్నతనం మళ్ళీ వచ్చేసి అమ్మ చంక ఎక్కేసి 

గోరుముద్దలు తిన్నట్లు..

 

ఇవన్నీ....


నీ ఒక్క చిరునవ్వులో దొరికేసాయి..

జత

ఇది 

ఎన్ని జన్మల పరిచయమో..

మరెన్ని జన్మల పయనమో..

ప్రతి క్షణం సరికొత్తగా  నేను 

పుడుతున్నాను

మళ్ళీ మళ్ళీ నీతో ప్రేమలో 

పడుతున్నాను..