Saturday, December 17, 2022

నీకోసం..

నీకోసం.. 

నిల్చుని ఉన్నా  ఒక మూల

పట్టుకుని నా  ప్రేమ  మాల

నువ్వు

 నా కలల్ని చదివేసావో

నా కళ్ళలోకొచ్చి చూసావో

జీవితంలోకి వచ్చావు

వసంతం తెచ్చేవు.

దోసిలి పూలు

 ఈ దోసిలి పూలు నీ కోసం 

పడిగాపులు పడి ఎదురు చూస్తున్నవి

ఈ కనుకొనల కన్నీటి చుక్క

లక్ష అక్షౌహిణలంత భారవవుతున్నది.

నీ చూఫు పడని ఈ చీకటిలో

నేనుండలేకపోతున్నాను

నీ నవ్వు పూయని ఈ అమవాసని

నే చూడలేకపోతున్నాను

మౌనం

 నీ  మౌనం..

కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల 

దూరంలా భారంలా అనిపిస్తుంది 

నీ నిశ్శబ్దం..

కొన్ని కోట్ల శత్రుఘ్నుల శబ్దంలా 

మనసును విచ్చిన్నం చేస్తుంది.

తెలియలేదు..

 నాకు నేను నచ్చలేదు

నువ్వు మెచ్చుకునే వరకూ..

నేనంటే నాకు అంత ఇష్టం లేదు

నువ్వు ఇష్టపడే వరకూ

అంతెందుకు..

నువ్వు వచ్చే వరకూ 

నువ్వు చూసే వరకూ

నువ్వు నవ్వే వరకూ

ప్రపంచం ఇంత అందంగా 

ఉంటుందనే తెలియలేదు..

భాష

 అక్షరాలకేమి తెలుసు..

నీ గురించి రాయాలంటే..

అవి కూడా భాష నేర్చుకోవాలని..

ఏభై ఆరు అక్షరాలు

 అక్షరాలన్నీ కూడబలుక్కుని

మొరాయిస్తున్నాయి...

ఒరేయ్ పిచ్చి సన్నాసీ,

ఐదు.. ఆరు జన్మల బంధాన్ని

ఈ ఏభై ఆరు అక్షరాల్లో ఎలా 

బంధించమంటావు అని.